వేడి నుంచి ఉపసమనం కలగాలంటే

- June 02, 2016 , by Maagulf
వేడి నుంచి ఉపసమనం కలగాలంటే

వేడి నుంచి సాంత్వన
విపరీతమైన ఎండ వేడి వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వేడిని దూరం చేసుకోవాలి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలు వేడిని దూరం చేసి సాంత్వన అందిస్తాయి.
గులాబీలు : ఈ రేకల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వాటిని నూనెల్లో, సబ్బుల తయారీలోనూ వాడుతుంటారు. ఎండలో కమిలిన చర్మం తిరిగి జీవంతో వెలిగిపోవాలంటే.. నీడలో గులాబీరేకలని ఎండబెట్టి, వాటితో టీ తయారు చేసుకుని తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. వేడి నుంచి సాంత్వన అందుతుంది. డయేరియా వంటి సమస్యలున్నా తగ్గిపోతాయి.
పుదీనా: పుదీనా ఆకుల్ని ఈ కాలంలో ఏ రూపంలో తీసుకున్నా ఫర్వాలేదు. పుదీనానీ చట్నీగా చేసుకోవచ్చు, సలాడ్లలో వేసుకోవచ్చు. డికాక్షన్‌లో ఆకులు వేసి టీలానూ కాచుకుని తాగొచ్చు. ఎలా తీసుకున్నా దాని ఫలితాలు అమోఘం. వేసవిలో తలెత్తే తలనొప్పీ, వికారాలతోపాటూ ఒత్తిడీ, నీరసం వంటివి రాకుండా పుదీనా చూస్తుంది.
ఉసిరి: ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరగకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తుంది. దీన్నుంచి విటమిన్‌ సి అందుతుంది. రోగనిరోధక శక్తీపెరుగుతుంది.
తులసి: ఈ కాలంలో చెమట రూపంలో లవణాలని కోల్పోతుంటాం మనం. దాంతో వికారం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. గుప్పెడు తులసి ఆకుల రసాన్ని మనం ఏ రూపంలో తీసుకున్నా ఎ విటమిన్‌ పుష్కలంగా అందడంతో పాటూ, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాల భర్తీ తేలిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుంచి పుష్కలంగా అందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com