సముద్రం
- June 02, 2016
ఒక్క కవితాబీజం మస్తిష్కక్షేత్రంలో ఎన్ని కవితలనైనా పుట్టించేస్తుంది. ఏ మహాకవి ఉదాత్త కమనీయ భావనో తెలీదు కానీ,
చాలా ఏళ్ల క్రితం "సముద్రం నీరు ఎంత ఉప్పనో! అవి ఎన్ని చేపల కన్నీళ్లో" అనే కవిత విన్నాను ఎక్కడో. అది గుర్తొచ్చి నన్ను ఇందాక కుదిపింది. ఇలా రాసుకున్నాను.
సముద్రం నీరు
ఉప్పన-
ఎగసి ఎగసి ఆడి
చెమట పట్టడంవల్లేమో!
ఉప్పు ఎక్కువైతే
హై బీ.పీ మనకి!
సముద్రంలో
చేపల సంగతేంటో!!
సముద్రం
ఎండదు, ఇంకదు-
సూర్యుడికి, భూదేవికి
"నో సాల్ట్ డైట్".
నదుల నీళ్లన్నీ
దోచేసి
ఒక్క చుక్కా తాగనివ్వడు-
సముద్రుడు నీటిదొంగ.
పిల్లల చేతి స్పర్శకోసం
ఎదురు చూస్తోంది!
సముద్రం పక్కన
తడిసిన ఇసుక.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







