‘గామి’ కోసం విశ్వక్ సేన్ కసరత్తులు మొదలెట్టేశాడు.!

- February 27, 2024 , by Maagulf
‘గామి’ కోసం విశ్వక్ సేన్ కసరత్తులు మొదలెట్టేశాడు.!

యూత్ హీరో విశ్వక్ సేన్.. తన సినిమాల్లోని కంటెంటే కాదు, సినిమాలను ప్రమోట్ చేసే విధానం కూడా సరికొత్తగా వుంటుంది. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలానే వుంటుంది.

ప్రాంక్ వీడియోలు.. గట్రా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ప్రమోషన్లు ప్లాన్ చేస్తుంటాడు. గతంలో కొన్ని సార్లు వివాదాల్లోకి ఎక్కాల్సి వచ్చిందనుకోండి తన సినిమా ప్రమోషన్ల ద్వారా.

ఆ తర్వాత కాస్త తగ్గించాడు. ఇప్పుడు ఆయన నటించిన ‘గామి’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా వుంది. ఇంతవరకూ విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నింట్లోకీ అత్యంత భిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది.

హ్యూమన్ టచ్ అంటే పడని అఘోరా శంకర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. ఛాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా, ఈ సినిమా ట్రైలర్‌ని లీప్ ఇయర్ (ఫిబ్రవరి 29న) సందర్భంగా ప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాడట.

ఈ ట్రైలర్ రిలీజ్‌కి నేను కూడా వస్తున్నాను.. నాతో పాటు వచ్చేదెవరు.? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. ఇప్పుడీ పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా విశ్వక్ సేన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కావడం లేదు. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఆసక్తికరంగా వస్తున్న ‘గామి’ అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com