‘హరి హర వీరమల్లు’ న్యూ అప్‌డేట్.!
- February 28, 2024
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న కోరిక చాలా మంది నిర్మాతల్లో బలంగా వుంటుంది. అలాంటి ఓ బలమైన నిర్మాతే ఎ.ఎమ్ రత్నం.
‘హరి హరవీరమల్లు’ సినిమాతో ఆయనకు ఆ అవకాశం రానే వచ్చింది. అయితే, ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలమే అయినప్పటికీ, ఇంతవరకూ పూర్తి కాలేదు.
సరికదా.. మొత్తానికి ప్రాజెక్ట్ అటకెక్కేసిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయ్. లేటెస్ట్‌గా ఈ సినిమా నిర్మాత ఎ.ఎమ్.రత్నం ఇదే విషయమై స్పందించారు. ఈ సినిమా ఆగిపోలేదనీ.. అలా అని పూర్తి కావడం కూడా అంత వీజీ కాదని చెప్పేశారు.
పవన్ కళ్యాణ్‌తో ఏదో ఒక సినిమా చేసేయాలన్నది తన లక్ష్యం కాదనీ, ఇండియా గర్వపడే ఓ అద్భుతమైన సినిమాని పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాలన్నదే తన వుద్దేశ్యమనీ.. అలాంటి సినిమానే ‘హరి హరవీరమల్లు’.. సో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని ఆయనతో అలాగే రూపొందిస్తాననీ ఆయన చెప్పారు.
కేవలం 20 రోజులు డేట్స్ తీసుకుని కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా తెరకెక్కించేయొచ్చు. కానీ, ఆయన స్థాయికి తగ్గ సినిమానే ఆయనతో రూపొందించాలన్న తన తపనను ‘హరి హర వీరమల్లు’తో నెరవేర్చుకుంటానని ఆయన కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. లేట్ అయినా, లేటెస్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఎ.ఎమ్ రత్నం చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీగా ‘హరి హరవీరమల్లు’ను అభివర్ణించారాయన. సో, ఆ రేంజ్‌కి తగ్గట్లుగానే వుంటుందని చెప్పడంతో.. ఈ సినిమా అయితే ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







