ఒమన్‌కు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక జారీ

- February 29, 2024 , by Maagulf
ఒమన్‌కు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక జారీ

మస్కట్: ఉత్తర అల్ బతినా, అల్ దహిరా మరియు అల్ బురైమి గవర్నరేట్‌లలో వడగళ్లతో కూడిన భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అలెర్ట్ ప్రకటించారు. ఇవి క్రమంగా దక్షిణ అల్ బతినా, మస్కట్, అల్ దఖిలియా, నార్త్ అల్ షర్కియా మరియు సౌత్ అల్ వైపు విస్తరిస్తుందని తెలిపారు. వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఉరుములతో కూడిన జల్లులు పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాడీలు (ఫ్లాష్ వరదలు) మరియు లోతట్టు ప్రాంతాలను దాటవద్దని, హెచ్చరిక సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని పౌర విమానయాన అథారిటీ (CAA) ప్రజలకు సూచించింది. వర్షపాతం 20 మిమీ నుండి 50 మిమీ వరకు ఉంటుందని.. ఇది ఆకస్మిక వరదలకు కారణం కావచ్చని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com