అద్దెదారుల కోసం కొత్త యాప్..భారీగా ఆదా..!
- March 01, 2024
దుబాయ్: అద్దెదారుల కోసం కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అద్దెదారులకు సంవత్సరానికి 3 బిలియన్ దిర్హామ్‌ల వరకు ఆదా అవుతుందని యాప్ నిర్వాహకులు తెలిపారు. అద్దే ఒప్పందాలను డిజిటలైజ్ చేసే ‘టేకేమ్’ గురువారం జరిగిన యాప్ ఒలింపిక్స్‌లో వారి బెస్ట్ అడ్వాన్స్‌డ్ కేటగిరీ విజేతగా ఎంపికైంది. "సాధారణంగా, అద్దెదారు 5 శాతం ఏజెన్సీ ఫీజు మరియు 5 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కానీ టేకీమ్‌తో, అద్దెదారు లావాదేవీ రుసుములో 3 శాతం, సెక్యూరిటీ డిపాజిట్ బీమాలో 1 శాతం మరియు అద్దె హామీ బీమాలో 1 శాతం మాత్రమే చెల్లించాలి. కాబట్టి 10 శాతం చెల్లించే బదులు, వారు మొత్తం 5 శాతం మాత్రమే చెల్లించవచ్చు." అని యాప్ ఫౌండర్ రాకేష్ మావత్ వివరించారు.
యాప్ ఒలింపిక్స్ అనేది ప్రపంచంలోని మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ క్యాపిటల్‌గా మారడానికి దుబాయ్ ఏర్పాట చేసింది. డిజిటల్ డొమైన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎమిరేట్ స్థానాన్ని బలోపేతం చేయడానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించిన ‘దుబాయ్‌లో యాప్‌లను సృష్టించండి’ కార్యక్రమంలో ఇది భాగం. ప్రపంచం నలుమూలల నుండి 1100 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి. మొత్తం నాలుగు విభాగాల్లోని విజేతలకు Dh500,000 బహుమతిగా అందించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







