పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న ధనుష్ ..!

- June 03, 2016 , by Maagulf
పారితోషికం తీసుకోకుండా  నటిస్తున్న ధనుష్ ..!

రాన్‌జనా సినిమాతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు ధనుష్. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్, ధనుష్ మధ్య చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆనంద్.ఎల్.రాయ్ నిమ్మో పేరుతో హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఆనంద్‌తో ఉన్న అనుబంధం కారణంగా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ధనుష్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com