ఎడారిలో మోటార్‌సైకిల్ ప్రమాదం.. ఎయిర్ లిఫ్ట్ తో ఆసుపత్రికి తరలింపు
- March 03, 2024
యూఏఈ: మోటార్‌సైకిల్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి యూఏఈ అధికారులు ఎయిర్ లిఫ్ట్ ద్వార ఆస్పత్రికి తరలించారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్.. షార్జా పోలీసుల సమన్వయంతో అల్ మేడమ్ ప్రాంతంలోని ఎడారి నుండి వ్యక్తిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఫుజైరా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 22న.. 24 ఏళ్ల గాయపడిన వ్యక్తిని అధికారులు కార్గో షిప్ నుండి విమానంలో ఆస్పత్రికి తరలించారు. యూఏఈ ప్రాదేశిక జలాల్లో కార్గో షిప్ ఉన్న సమయంలో అందులోని ఆసియా వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సదరు వ్యక్తిని తరలించేందుకు అధికార యంత్రాంగం 'సెర్చ్ అండ్ రెస్క్యూ' హెలికాప్టర్‌ను ఉపయోగించి చికిత్స కోసం ఆ వ్యక్తిని అల్ ఖాసిమి ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..