ప్రపంచంలోనే అతిపెద్ద బుక్ సేల్..75% వరకు తగ్గింపు
- March 03, 2024
దుబాయ్: బిగ్ బ్యాడ్ వోల్ఫ్ దుబాయ్‌కి తిరిగి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక విక్రయం శుక్రవారం దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్‌లో ఐదవ ఎడిషన్ ప్రారంభమైంది. ఇది మార్చి 10 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. బెస్ట్ సెల్లర్‌లు, జీవిత చరిత్రలు, గ్రాఫిక్ నవలలు, వంట పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, క్లాసిక్‌లు, స్వయం-సహాయం, సైన్స్ ఫిక్షన్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌లు, చరిత్ర, సహా రెండు మిలియన్లకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 75 శాతం వరకు తగ్గింపుతో ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక విక్రయంగా ప్రసిద్ధి చెందిన బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్స్ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయని వ్యవస్థాపకుడు ఆండ్రూ యాప్ వెల్లడించారు. రెండు నెలల క్రితం బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్స్ షార్జాలో మొదటి ప్రవేశించింది. బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్స్‌కి షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వంలో దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







