హదిత పోర్ట్ ద్వారా స్మగ్లింగ్...63,000 క్యాప్‌గాన్ టాబ్లెట్స్ సీజ్

- March 04, 2024 , by Maagulf
హదిత పోర్ట్ ద్వారా స్మగ్లింగ్...63,000 క్యాప్‌గాన్ టాబ్లెట్స్ సీజ్

రియాద్: హదిత పోర్ట్ ద్వారా 63,000 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించడానికి చేసిన రెండు ప్రయత్నాలను జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. సౌదీ అరేబియాలోకి ప్రవేశించే రెండు వాహనాల్లో దాచిన నిషిద్ధ వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మొదటి కేసులో వాహనం యొక్క వివిధ భాగాలలో దాచిన 41,279 క్యాప్టాగన్ మాత్రలను గుర్తించారు. రెండో ప్రయత్నంలో పోర్టుకు వచ్చే మరో వాహనంలో ఇదే పద్ధతిలో దాచిన 22,000 మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి ఐదుగురు వ్యక్తుల అరెస్టు చేసినట్లు అథారిటీ తెలిపింది.  స్మగ్లింగ్ కార్యకలాపాల సమాచారాన్ని భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలపాలని కోరింది. సరైన సమాచారాన్ని అందజేసిన వారికి  రివార్డ్‌క ఇస్తామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com