నేడు, రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
- March 04, 2024
న్యూ ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. అదేవిధంగా బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. మోదీ సుడిగాలి పర్యటనల్లో భాగంగా మొదట తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది. లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను తొమ్మిది నియోజకవర్గాలకు పార్టీ జాతీయ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ సమరానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఇదిలాఉంటే రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
మోదీ పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అదిలాబాద్, సంగా రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారు.
తొలిరోజు సోమవారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
సోమవారం ఉదయం 9.20గంటలకు మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బయల్దేరి 10.20 గంటలకు అదిబాద్ కు చేరుకుంటారు.
ఉదయం 10.30 గంటల నుంచి 11గంటల వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పార్టీ బహిరంగలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
బహిరంగ సభ అనంతరం నాందేడ్ చేరుకొని అక్కడ నుంచి చెన్నై వెళ్తారు. చెన్నైలో కార్యక్రమాలు ముగించుకొని రాత్రికి హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారు.
మంగళవారం (5వ తేదీ) సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు.
10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరి.. బేగంపేట విమానాశ్రయంకు వెళ్తారు. అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరుతారు.
10:40 నిమిషాలకు సంగారెడ్డికి చేరుకుంటారు.
10:45 నుండి 11:15 నిమిషాల వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు.
ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12: 45 నిమిషాల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
సంగారెడ్డి బహిరంగ సభ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 12: 55 కు చేరుకుంటారు.
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఒడిస్సాకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.
మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులు.
6,000 కోట్లుతో నిర్మాణం రామగుండంలో NTPC నిర్మించిన రెండవ థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం.
70 కోట్లుతో అంబారి – ఆదిలాబాద్ – పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ జాతికి అంకితం.
ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఫిజికల్‌గా, వర్చువల్‌గా 6,697 కోట్ల పనులకు శంకుస్థాపన.
ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు.
491 కోట్లు తో ఆదిలాబాద్ – బేలా మధ్య NH-353B పై 32.970 కి.మీ. ల పొడవైన 2లైన్ హైవే విస్తరణ.
136 కోట్లు NH-163 పై హైదరాబాద్ – భూపాలపట్నం రహదారి విస్తరణ కు శంకుస్థాపన
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష