రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- March 04, 2024
హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అదిలాబాద్ జిల్లాకు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు. అదిలాబాద్ లో రూ. 7వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడి తరువాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతున్నట్లు రేవంత్ చెప్పారు.
కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని రేవంత్ అన్నారు. గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలని, ప్రధాని మోదీ అంటే మాకు పెద్దన్నలాంటి వారని రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని రేవంత్ చెప్పారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధాని మోదీకి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







