15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

- March 04, 2024 , by Maagulf
15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

యూఏఈ:  19 మంది స్నేహితులతో భారతీయ ప్రవాసుడు మహ్మద్ షెరీఫ్‌ ఆదివారం 15 మిలియన్ దిర్హామ్‌ల బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాదడు. బిగ్ టికెట్ హోస్ట్‌లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి ఈ వార్తను తెలియజేసినప్పుడు మహ్మద్ షెరీఫ్‌కు తెలిపిన సమయంలో ఎమోషనల్ అయ్యాడు. ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన విజేత టికెట్ (నంబర్ 186551) గురించి హోస్ట్‌లు  షెరీఫ్‌కు తెలిపారు. అది విని షరీఫ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాను మరియు అతని స్నేహితులు గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఇరవై మంది ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నామని.. కొందరు టాక్సీ డ్రైవర్‌లుగా మరియు మరికొందరు బ్లూ కాలర్ కార్మికులుగా పని చేస్తున్నారని.. టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి క్రమం తప్పకుండా సహకరిస్తారని వివరించాడు. ఇప్పుడు వారు ఒక్కొక్కరు కనీసం Dh750,000 పంచుకోకానున్నారు. షెరీఫ్ అవార్డు ప్రదానోత్సవానికి తదుపరి డ్రాకు హాజరవుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com