గోపీచంద్ - ప్రబాస్ కాంబినేషన్‌లో మరో ‘వర్షం’ రాబోతోందా.?
- March 04, 2024
‘వర్షం’ సినిమాలో గోపీచంద్, ప్రబాస్ నటించిన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ విలన్ రోల్‌లో గోపీచంద్ కనిపించాడీ సినిమాలో. తెరపై హీరో, విలన్లుగా నటించిన ఈ ఇద్దరూ తెర వెనక రియల్ స్టోరీలో చాలా చాలా మంచి స్నేహితులు.
కేవలం సహ నటీనటులు మాత్రమే కాదు, వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం వుందట. ఒకరి మాటంటే ఇంకొకరికి అమితమైన గౌరవం.. అభిమానం. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలాగే వుంటారా.? ఇలాగే వుండాలి.. అనేంత బాండింగ్ వుంది వీరిద్దరి మధ్యా.
అయితే, ఫ్యాన్స్‌కి మాత్రం వీరిద్దరూ కలిసి మరోసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటే బావుంటుందని వుంటుంది. కానీ, ఇఫ్పుడు గోపీచంద్ హీరో పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. కెరీర్ మొదట్లో విలన్‌గా పరిచయమైనప్పటికీ ఇప్పుడు హీరోగానే సెటిలైపోయాడు.
ప్రబాస్‌తో కలిసి తనకూ ఓ సినిమా చేయాలని వుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గోపీచంద్. కానీ, అలాంటి ఓ ప్రాజెక్ట్ సెట్ కావాలిగా. కేవలం హీరోగానే కాదు, ప్రబాస్‌కి విలన్‌గా నటించడానికైనా తాను సిద్ధమే అంటున్నాడట.
లేదంటే గెస్ట్ రోల్ అయినా నాకు ఓకే అంటున్నాడు. మరింకేం, మేకర్లు ఆ పనిలో వుంటే, ఓ మంచి మల్టీ స్టారర్ కాంబినేషన్‌ని సినీ ప్రియులు ఎంజాయ్ చేసే అవకాశం కల్పించినట్లే.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







