‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’.! ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి బాస్.!
- March 04, 2024
కమర్షియల్ ముసుగులో కొన్ని మంచి సినిమాలు మరుగున పడిపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పుష్ప’ తదితర నెగిటివ్ జోనర్ మూవీస్ అంత పెద్ద సక్సెస్ అయినప్పుడు.. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి ఓ మంచి కథ, ఎమోషన్, క్యూట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ సినిమాలు ఎందుకు సక్సెస్ కావు.
ఈ సినిమా అనే కాదు. ఈ మధ్య చాలా సినిమాలు ధియేటర్లలో ఫెయిలై, ఓటీటీలో సక్సెస్ అవుతున్నాయ్. ఆ మాటకొస్తే.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ సినిమాకీ థియేటర్లలోనూ మంచి ఆదరణే దక్కిందనుకోండి. కానీ, ఇది చాలదు.
ఇలాంటి కొత్త తరహా సినిమాలు మరిన్ని రావాలంటే, ఎంకరేజ్‌మెంట్ ఇంకా పతాక స్థాయిలో వుండాలి. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే అనిపిస్తుంటుంది. సినిమా ఇంకా బతికుందని.
కమెడియన్ సుహాస్, శివాని, శరణ్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంబంధించి మాటలు, సినిమాటోగ్రఫీ, కథ, కథనం ఇలా అన్నీ డైమండ్సే. హృద్యమైన దృశ్య రూపమిచ్చారు. ధియేటర్ల నుంచి ఓటీటీకొచ్చిన ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. ఓటీటీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయ్.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







