మిల్కీ బ్యూటీ తమన్నా.! ఆ పాత్రలోనా.?
- March 04, 2024
మిల్కీ బ్యూటీ అని సంబోధించడం తమన్నాకి అస్సలు నచ్చదు కానీ, ఆమె మేని సౌందర్యం అందమైన ఆకృతిని చూసి అలా సంబోధించకుండా వుండలేరుగా ఫ్యాన్స్.
తమన్నా నటించిన సినిమాలకు ఆమె గ్లామర్ ఓ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అయితే, తమన్నాని డీగ్లామర్ రోల్‌లో ఊహించగలమా.?
ఊహించుకోవాలి. ఎందుకంటే, తమన్నా డీ గ్లామర్ రోల్ పోషించిన సినిమా ఒకటి త్వరలో రాబోతోంది. ఈ సినిమాలో శివ శక్తి పాత్రలో తమన్నా కనిపించబోతోంది. ప్రస్తుతం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘రచ్చ’ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. చాలా అందంగా చూపించాడు ఈ సినిమాలో తమన్నాని సంపత్ నంది.
ఇప్పుడు ఆయన నిర్మాణం వహిస్తున్న సినిమాలో తమన్నా ఓ ప్రయోగాత్మక రోల్‌లో కనిపించబోతోంది. అశోక్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







