భారతీయ బ్లూ కాలర్ కార్మికులు, ఉద్యోగుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్

- March 05, 2024 , by Maagulf
భారతీయ బ్లూ కాలర్ కార్మికులు, ఉద్యోగుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్

యూఏఈ: యూఏఈలో ప‌నిచేసే భారతీయ బ్లూ కాలర్ కార్మికులు, ఉద్యోగుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ను గర్గాష్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ LLC, ఓరియంట్ ఇన్సూరెన్స్ PJSC ఇన్సూరెన్స్ ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించాయి. యూఏఈలో సుమారు 3.5 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 65 శాతం మంది బ్లూ కాలర్ కార్మికులు,ఉద్యోగులు ఉన్నారు. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా చొర‌వ‌తో ఇన్సూరెన్స్ ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించారు. 2022లో మొత్తం 1,750 మంది మరణించారని ఎంబసీ తెలిపింది. వారిలో 1,100 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 90 శాతం మరణాలు సహజంగానే ఉన్నట్లు వెల్లడించింది. మరణించిన వారికి పని ప్రాంతంలో పరిహారం తప్ప ఇతర బీమా లేదని గుర్తించినట్లు ఎంబసీ గుర్తించింది. దీనిని పరిష్కరించడానికి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా..దుబాయ్ ప్రధాన కంపెనీల మధ్య సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ బ్లూ కాలర్ వర్కర్లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ప్యాకేజీలను రూపొందించాలని ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు నిబంధనలు, విధివిధానాలు రూపొందించారు.

లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ప్రారంభించిన సందర్భంగా కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ మాట్లాడుతూ.. భారతీయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్మికుల సహజ మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఒక సంవత్సరంలో మరియు సహజమైన సందర్భంలో మరణించిన వారి కుటుంబానికి కొన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి లైఫ్ ఇన్సూరెన్స్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలని సూచించామన్నారు. సంవత్సరానికి AED 37 కనిష్ట ప్రీమియంతో లభించే రక్షణ మార్చి 1 నుండి అమల్లోకి వచ్చిందన్నారు. లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి మరిన్ని వివరాల కోసం ఇమెయిల్ ఐడి [email protected] మరియు ఫోన్ నెం. 0527172944/0526167787 లలో సంప్రదించాలని కోరారు.

లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ముఖ్యంశాలు
* యూఏఈ ఉపాధి వీసా ఉన్న ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా 24 గంటల కవరేజ్
* ఏదైనా కారణం వల్ల మరణం (సహజ మరియు ప్రమాదవశాత్తు)
* ప్రమాదం కారణంగా శాశ్వత మొత్తం / పాక్షిక వైకల్యం
* స్వదేశానికి వెళ్లే ఖర్చులు (మరణానికి మాత్రమే) - ప్రతి వ్యక్తికి AED 12,000 వరకు
* వయోపరిమితి 18 నుంచి 70 ఏళ్లు

ప్రతి వ్యక్తికి సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్ -వార్షిక ప్రీమియం
ప్రతి వ్యక్తికి AED 35,000 -AED 37
ప్రతి వ్యక్తికి AED 50,000 -AED 50
ప్రతి వ్యక్తికి AED 75,000 -AED 72

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com