వెదర్ అలెర్ట్: ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన..!
- March 05, 2024
యూఏఈ: మంగళవారం తెల్లవారుజామున అల్ ఐన్ ప్రాంతంలో వడగళ్ల వాన కురుస్తుండడంతో నివాసితులు మేల్కొన్నారు. అలాగే అబుదాబి, రస్ అల్ ఖైమా మరియు షార్జాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా ఎడతెగని వర్షం కురిసింది. దుబాయ్‌లోని నివాసితులు ఉరుములు మరియు తేలికపాటి వర్షం కురిసిందని తెలిపారు. యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) వాతావరణ పరిస్థితుల గురించి హెచ్చరిక జారీ చేసింది,.అబుదాబి మరియు ఫుజైరాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దుబాయ్‌లో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు మరియు బలమైన గాలుల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రతికూల వాతావరణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అబుదాబి పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. వాహనాల వేగాన్ని తగ్గించాలని సూచించారు. అబుదాబి - అల్ ఐన్ రహదారి (అల్ హఫర్ బ్రిడ్జ్ - బనియాస్ బ్రిడ్జ్) మరియు మక్తూమ్ బిన్ రషీద్ రోడ్ (అల్ షహమా బ్రిడ్జ్ - 80 కి.మీ./గం. అల్ నౌఫ్ వంతెన) లపై వేగ పరిమితులను తగ్గించారు. మరోవైపు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







