900 మంది ఖైదీలకు.. 1.5 మిలియన్ దిర్హామ్‌లు విరాళం
- March 05, 2024
దుబాయ్: రమదాన్ పతిత్ర మాసంలో దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త, ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు ఫిరోజ్ మర్చంట్ మరోసారి తన దానగుణాన్ని చాటుకున్నారు. యూఏఈ జైళ్లలో శిక్ష అనుభిస్తున్న 900 మంది ఖైదీల విడుదలకు 1 Dh1.5 మిలియన్ల మొత్తాన్ని చెల్లించనున్నారు. కరడుగట్టిన నేరస్థులకు కాకుండా.. దురదృష్టానికి గురైనవారు, వారి నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా ఆర్థిక చెల్లింపులను చేయలేని వారికి నిధులను కేటాయించినట్లు తెలిపారు. 2008లో స్థాపించబడిన తన ఫర్గాటెన్ సొసైటీ ద్వారా ఖైదీలతోపాటు ఆపదలో ఉన్నవారి అప్పులను తీర్చడమే కాకుండా, వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా అందిస్తాడు. గత 16 సంవత్సరాలుగా 20 వేల మందికి పైగా ఖైదీల విడుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. 1980లో ముంబైకి చెందిన రోసీనాను వివాహం చేసుకొన్న ఫిరోజ్ 1989లోదుబాయ్కి విజిట్ వీసా పొంది తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీని స్థాపించాడు. ప్రస్తుతం 12 దేశాలలో 150 స్టోర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









