ఫ్యామిలీ స్టార్’.! ఇలాగైతే మెప్పించగలడా.?
- March 05, 2024
విజయ్ దేవరకొండకు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ‘ఖుషి’తో చాలా చాలా కష్టపడ్డాడు కానీ, ఫలితం ఆశించదగ్గ రీతిలో రాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ అంటూ వస్తున్నాడు.
సూపర్ హిట్ కాంబో అయిన పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. అంచనాలు బాగానే వున్నాయ్. మొన్నామధ్య గ్లింప్స్ రిలీజైంది. పాజిటివ్ రెస్పాన్సే అందుకుంది.
తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇంట్లో వాళ్ల పట్ల మరీ ముఖ్యంగా భార్య పట్ల సాఫ్ట్‌గా వుండే భర్తగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడీ సినిమాలో.
ఆఖరికి భార్యని ఆఫీస్‌లో డ్రాప్ చేయాలంటే, బండిలో లీటరు పెట్రోల్ కోసం డబ్బులు భార్యనే అడిగే భర్త పాత్ర అది. కానీ, బయట మాత్రం మనోడు ఫుల్ రఫ్ అండోయ్.
బీభత్సమైన ఫైట్లు గట్రా చేసేస్తుంటాడు. ఇలా ఓ వైపు మాస్, మరోవైపు క్లాస్.. ఫ్యామిలీని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తెరకెక్కింది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. మరీ, ఆ లక్కు మన ఫ్యామిలీ స్టార్‌కి చిక్కుతుందో లేదో చూడాలిక.!
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







