‘విశ్వంభర’ జోరు.! మెగాస్టార్ చిరంజీవి హుషారు.!
- March 05, 2024
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే సతీ సమేతంగా విదేశాలకు వెళ్లి వచ్చిన పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్‌లో బిజీ అయిపోయారు.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కోసం తనను తాను సిద్ధం చేసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఓ సాంగ్ షూట్ జరుగుతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూట్ చేస్తున్న సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవిత, త్రిషతో పాటూ, ఫ్యామిలీ మెంబర్స్‌గా నటిస్తున్న కీలక నటీ నటులపై ఈ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారట.
గ్రూప్ సాంగ్‌లా బ్రైట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సాంగ్ సినిమాలో విజువల్ ఫీస్ట్ అవుతుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రతిస్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా మూడు కాలాల నేపథ్యంలో రూపొందబోయే డిఫరెంట్ సబ్జెక్ట్ అనీ తెలుస్తోంది.
గ్రాఫిక్స్‌కి ఈ సినిమాలో పెద్ద పీట వేయబోతున్నారనీ ముందుగానే చిత్ర యూనిట్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







