మీ కిడ్నీలు సేఫ్‌గా వుండాలంటే ఈ ఆహారం జాగ్రత్త అవసరం సుమా.!

- March 05, 2024 , by Maagulf
మీ కిడ్నీలు సేఫ్‌గా వుండాలంటే ఈ ఆహారం జాగ్రత్త అవసరం సుమా.!

కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ప్రక్రియ సక్రమంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండాలంటే, శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా వుండాల్సిందే.

మరి, మన కిడ్నీలు సేఫ్‌గా వుండాలంటే ఏం చేయాలి.? డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే. హైబీపీ వున్నవారికి కిడ్నీ సమస్యలు అధికం. అందుకే వారు వంటల్లో ఉప్పు వాడకం తగ్గించాలి.

టమాటా, పాలకూర వంటి కూరగాయలను పూర్తిగా మానేయకూడదు కానీ, తక్కువగా తీసుకోవాలి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి. అలాగే, కాల్షియ, పొటాషియం ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి.

రోజులో మూడు లీటర్ల నీరు తగ్గకుండా తాగుతుండాలి. రోజువారి వంటల్లో అల్లం, పసుపు, కొత్తిమీరను కంపల్సరీ చేసుకోవాలి. కొత్తిమీరలోని పోషకాలు రక్త సరఫరాని వేగవంతం చేస్తాయ్. తద్వారా కిడ్నీల్లో ఎటువంటి బ్లాక్స్ లేకుండా సురక్షితంగా పని చేస్తాయ్.
వీటన్నింటితో పాటూ, చిన్నపాటి వ్యాయామాన్ని కూడా రెగ్యులర్ జీవన శైలిలో భాగం చేసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com