చివరి సభలో కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్..!

- March 09, 2024 , by Maagulf
చివరి సభలో కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్..!

అమరావతి: ఏపీలో ఎటు చూసినా సిద్ధం మేనియా. ఏపీలో ఏ హోర్డింగ్స్ చూసినా సిద్ధమే. రాష్ట్ర చరిత్రలోనే సిద్ధం పేరుతో అతిపెద్ద సభ నిర్వహిస్తున్న వైసీపీ చివరి సభకు భారీ ఏర్పాట్లు చేసింది. మార్చి 10వ తేదీన అద్దంకి వేదికగా ఆఖరి సిద్ధం సభ జరగనుంది. చివరి సభకు 15లక్షల మంది కేడర్ వస్తారని అంచనా వేశారు. చివరి సభ కావడంతో ఈ సభ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే మూడు సభల ద్వారా పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపిన సీఎం జగన్.. చివరి సభకు రెడీ అయిపోయారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఈ చివరి సిద్ధం సభను గతంలోకంటే గ్రాండ్ సక్సెస్ చేసి ఎన్నికల సమరంలోకి దూకాలని చూస్తోంది వైసీపీ. ఇప్పటివరకు మూడు సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ. భీమిలిలో రెండో సభ, దెందులూరులో రెండో సభ, రాప్తాడులో 3వది నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన మూడు సభల ద్వారా పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం నింపారు ముఖ్యమంత్రి జగన్.

ముఖ్యంగా గత ఐదేళ్లలో తాను ఏం చేశానో చెబుతూనే.. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయిని విమర్శలు గుప్పించారు. సిద్ధం సభలతో పార్డీ కేడర్ చాలా యాక్టివ్ గా అయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు. సిద్ధం సభలతో పార్టీకి మరింత పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు జరిగిన సభలు ఒక ఎత్తు, చివరి సభ మరొక ఎత్తు అంటోంది వైసీపీ. చివరి భారీ బహిరంగ సభ కావడంతో ఇందులో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, ఇదే సభలో మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

గత నవరత్నాలకు మరిన్ని జోడింగ్ మ్యానిఫెస్టోను సీఎం జగన్ రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే మ్యానిఫెస్టో రూపకల్పన పూర్తి చేశారు. మహిళలు, రైతులు, యువతకు కొన్ని కొత్త పథకాలు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన సిద్ధం సభలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోష్ ను నింపాయి. ఇక, చివరి సభతో ఎన్నికల రణక్షేత్రంలోకి దూకనుంది వైసీపీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com