సంధ్య కంటి ఆసుపత్రిలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలు

- March 09, 2024 , by Maagulf
సంధ్య కంటి ఆసుపత్రిలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలు

విజయవాడ: నేత్ర వైద్య రంగంలో విశేష ఖ్యాతి గడించిన సంధ్య కంటి ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ ల నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించేలా అంతర్జాతీయ స్థాయి పర్సనలైజ్డ్ జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలను సంధ్య కంటి ఆసుపత్రిలో ప్రారంభించారు.ఈ సందర్భంగా సూర్యారావుపేట, కాళేశ్వరరావు రోడ్ లోని   సంధ్య కంటి ఆసుపత్రిలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్ రామ్ మాట్లాడుతూ.. సంధ్య కంటి ఆసుపత్రి ద్వారా గడచిన మూడున్నర దశాబ్దాలుగా ప్రజలకు నేత్ర వైద్య చికిత్సలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ప్రపంచ శ్రేణి కంటి చికిత్సలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. అత్యంత అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణుల ఆధ్వర్యంలో, నేత్ర సంబంధ వ్యాధులకు నాణ్యమైన చికిత్సలను అందిస్తున్నామని భార్గవ్ రామ్ అన్నారు. ప్రముఖ లాసిక్ చికిత్సా నిపుణులు డాక్టర్ శశికపూర్ మాట్లాడుతూ.. సంధ్య కంటి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన జర్మన్ టెక్నాలజీ లాసిక్ విధానం ద్వారా దృష్టి లోపాలను అత్యంత ప్రభావవంతంగా పరిష్కరించవచ్చని, అత్యంత కచ్చితత్వం కలిగిన ఈ అత్యధునాతన చికిత్స ద్వారా కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ ల వినియోగం నుంచి స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. లాసిక్ చికిత్సలతో పాటు ఐసీఎల్, పిడియాట్రిక్ ఐ కేర్, ఆక్యులర్ కాస్మొటాలజీ, గ్లకోమా, ఫెమ్టోసెకండ్ లాసిక్, డయాబెటిక్ రెటినోపతి, బొటాక్స్, కేటరాక్ట్, మెల్లకన్ను సమస్యలకు అత్యున్నత శ్రేణి చికిత్సలు తమ ఆసుపత్రిలో లభిస్తాయని వివరించారు.రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతికతతో కూడిన తమ ఆసుపత్రిలో అందుబాటులో వున్న నేత్ర వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శశికపూర్ కోరారు. విద్యార్థినీ విద్యార్థులు కళాశాల గుర్తింపు కార్డు ఆసుపత్రి నందు చూపించి రాయితీ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో సంధ్య కంటి ఆసుపత్రి సెంటర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com