హిస్టరీ రిపీట్..సరిగ్గా 8 సంవత్సరాల క్రితం తుఫాన్ బీభత్సం..!

- March 10, 2024 , by Maagulf
హిస్టరీ రిపీట్..సరిగ్గా 8 సంవత్సరాల క్రితం తుఫాన్ బీభత్సం..!

యూఏఈ: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 2016లో మార్చి 9న దేశాన్ని తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ రోజున వడగళ్లతో కూడిన బలమైన తుఫాను ఎమిరేట్స్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అల్ షువైబ్ వాతావరణ కేంద్రంలో  24 గంటల వ్యవధిలో 287.6 మిమీ వర్షపాతం నమోదైంది.  అల్ బతీన్ విమానాశ్రయం 130 కిమీ వేగంతో అత్యధిక గాలి వేగాన్ని నమోదు చేసినప్పుడు దేశం అత్యధిక వర్షపాతం మరియు బలమైన గాలి వేగం నమోదైంది. తాజాగా అబుదాబిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దుబాయ్‌లోని రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) షేక్ జాయెద్ రోడ్‌లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు అలెర్ట్ జారీ చేసింది. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా భారీ వర్షంతో రస్ అల్ ఖైమా అతలాకుతలమైంది. అల్ మనీ, షావ్కా, అల్ గలీలా, జైస్, అల్ ఘెయిల్ ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు ఉన్న లోయలలో చిక్కుకున్న తర్వాత మొత్తం 21 మందిని RAK పోలీసులు రక్షించారు.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా షార్జా ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దేశంలోని తూర్పు తీరాన్ని భారీ వర్షాలు తాకడంతో ఫుజైరా వాడీలు కూడా జలమయమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com