సింగపూర్ లో ఘనంగా మహాశివరాత్రి వేడుకులు
- March 10, 2024
సింగపూర్: మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశం తో సింగపూర్ లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి , ధర్మ నిరతి మరియు ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు అయిన నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ఈ సంవత్సరము దశమ వార్షికోత్సవం జరుపుకోబుతున్నఈ శుభసందర్భంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం 8 మార్చి 2024 రాత్రి 11 గంటలు నుండి శనివారం ఉదయం 6 గంటలు వరుకు శ్రీ అరసకేసరి శివాన్ మందిరము ప్రాంగణములో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది.
భారతదేశం నుండి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్ను తో పంచ లింగములను పార్థివ లింగములుగా సమంత్రకముగా చేయడం జరిగింది. ఈ పంచ రుద్రులను మనము పృథివి ఆపః తేజో వాయుర్ఆకాశములు పంచభూతాత్మక పంచారామ క్షేత్రాధిష్ఠిత మహా లింగేశ్వరులుగా భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విషేశమైన ప్రక్రియ అని నిర్వాహుకులు తెలియచేసారు. ఈ సందర్భంగా పంచ రుద్రులుకి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమము సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున 100 కి మంది పైగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేసారు. కార్యక్రమము తదనంతరము తీర్ధ ప్రాసాదాలు వచ్చిన అతిధులకు అందచేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం అద్భుతమైన భక్తి కార్యక్రమం నిర్వహించింది, కార్యక్రమంలో భాగమైనందుకు మేము చాలా అనీర్వచమైన అనుభూతిని పొందాము, మొదటిసారి నిజమైన జాగరణ చేసాము.మహాశివరాత్రి రోజున, అభిషేకం చేసుకోవటం, అందునా పంచారామ లింగార్చన తో కూడుకొన్న జాగరణ అంతా శివమయం అయ్యింది అని చెప్పటం అతిశయోక్తి కాదు అని హర్షం వ్యక్తం చేసారు, కార్యక్రమం రూపకర్తలకు మరియు కార్యనిర్వాహకులకు చాలా ధన్యవాదాలు తెలియచేసారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష