‘విశ్వంభర’ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతోందా??
- March 10, 2024
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ సినిమా తరువాత మరోసారి గ్రాఫిక్స్ తో సిద్ధం చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుంది. కాగా గ్రాఫికల్ వండర్ గా రూపొందుతున్న ఈ మూవీ.. సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతుందని టాక్ వినిపిస్తుంది.
సిస్టర్ సెంటిమెంట్‌ని, సోషియో ఫాంటసీని జత చేతి వశిష్ఠ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఈక్రమంలోనే ఈ సినిమాలో చిరుకి చెల్లెళ్లుగా ముగ్గురు నటించబోతున్నారట. ఈ ముగ్గురిలో ఒకరు హీరోయిన్ సురభి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు చెల్లిళ్లతో చిరు కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిత్రం నిజంగానే సిస్టర్ సెంటిమెంట్ తోనే తెరకెక్కుతుందా..? ఈ ముగ్గురేనా చెల్లెళ్ళ పాత్రలు చేసేది అనేది తెలియాల్సి ఉంది.
కాగా గతంలో చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో ఇలా ముగ్గురు చెల్లిళ్లతో ఆడియన్స్ ముందుకు వచ్చి సిస్టర్ సెంటిమెంట్ తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ సమయంలో ప్లాప్స్ లో ఉన్న చిరుకి అది బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి.. భోళాశంకర్ తో ఎదుర్కొన్న విమర్శలు అన్నిటికి చెక్ పెడుతుందేమో చూడాలి.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు.. దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందన సినిమా కావడంతో.. మూవీలో 70 శాతం VFX పైనే డిజైన్ అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. అంజి సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేసిన చోట కె నాయుడు.. ఈ చిత్రానికి కూడా కెమెరా మెన్‌గా చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష