తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు..విజేత తెలుగు వారియర్స్
- March 11, 2024
ఖతార్: ఖతార్ లో నివసిస్తున్న తెలుగు కార్మికులకు క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతియేటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు మార్చ్ 8న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భగత్ సింగ్ జట్టును తెలుగు వారియర్స్ ఓడించి TGS TPl 9 ట్రోఫీని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయంలో హెడ్ ఆఫ్ లెబర్ వెల్ఫేయిర్ ఇంచార్జ్ జయ గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గెస్ట్ ఆఫ్ హానర్ ICBF అధ్యక్షుడు శనవాస్ బావ మాట్లాడుతూ.. TGS కార్మికుల కోసం నిరంతరం పని చేస్తున్నదని అభినందిచారు. తెలుగు సంఘాల బిష్మ పితా కోడూరి శివప్రసాదరావు మాట్లాడుతూ.. గల్ఫ్ సమితి అన్ని కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ICBF ఉపాధ్యక్షుడు దీపక్ షెట్టి ,ICBF సెక్రెటరీ మహమ్మద్ కుని,ICBF తెలుగు రెపర్సెంటివ్ శంకర్ గౌడ్, Qpl ఫౌండేర్స్ సిరాజ్అన్సారీ, హంజత్, గులరాజ్,అన్వేర్ లు విజేతలకి బహుమతులు అందజేశారు. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు, ఉపాధ్యక్షుడు గడ్డి రాజు,వంశీ,గోలి,సాగర్,ఎల్లన్న,ఎల్లన్న, శ్రీధర్,రాజేష్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







