రేపటి నుంచి భారత్ లో రంజాన్ దీక్షలు ప్రారంభం

- March 11, 2024 , by Maagulf
రేపటి నుంచి భారత్ లో రంజాన్ దీక్షలు ప్రారంభం

న్యూ ఢిల్లీ: రేపటి నుండి భారత్ లో రంజాన్ దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. సౌదీ అరేబియాలో ఈరోజు (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను మార్చి 11న ఆచరిస్తారు. భారతదేశం, పాకిస్తాన్లలో, సౌదీ అరేబియా చంద్రుని తర్వాత ఒక రోజు రంజాన్ చంద్రుడు కనిపిస్తాడు.. అందుకే ఈ దేశాలలో సౌదీ అరేబియా తర్వాత ఒక రోజు రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది. అంటే భారతదేశంలో రేపటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెలలో, ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఇది నెల ప్రారంభం, ముగింపును నిర్ణయించడంలో కీలకమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com