వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
- March 12, 2024
దుబాయ్: దుబాయ్-అల్ ఐన్ రోడ్‌లోని వంతెన కింద నీటిలో మునిగిపోయిన వాహనంలో చిక్కుకున్న కుటుంబాన్ని దుబాయ్ పోలీసుల అత్యవసర ప్రతిస్పందన బృందం రక్షించింది. ఈ వారాంతంలో యూఏఈ అంతటా కురిసిన భారీ కుండపోత వర్షాల కారణంగా వంతెన కింద ఉన్న రహదారి జలమయమైంది. సోషల్ మీడియా X లో అధికారులు విడుదల చేసిన ఫుటేజీలో.. రెస్క్యూ టీమ్ పడవతో భారీగా వరదలు ఉన్న ప్రాంతం నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడం కనిపించింది. నీట మునిగిన కారును కూడా బృందం బయటకు తీశారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నందున, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని మరియు నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







