సౌదీ అరేబియా అంతటా ఘనంగా జెండా దినోత్సవం

- March 12, 2024 , by Maagulf
సౌదీ అరేబియా అంతటా ఘనంగా జెండా దినోత్సవం

రియాద్:  సౌదీ అరేబియా వీధులు మరియు భవనాలను జాతీయ జెండాలతో అలంకరించారు. సౌదీ పతాక దినోత్సవ వేడుకలు  ప్రతి సంవత్సరం మార్చి 11 న జరుపుకుంటారు. 1727లో స్థాపన నాటి రాజ్యం యొక్క గొప్ప చరిత్రకు చిహ్నంగా నిలిచిన జెండా దేశమంతటా సగర్వంగా ప్రదర్శించబడుతున్నది.  ఈ ఫెస్టివల్ ప్రజలలో గర్వం, సంఘీభావం, ప్రేమ మరియు విధేయతను కలిగిస్తుంది.  జెండా రూపకల్పనలో ఉపయోగించిన రంగులు, లిపి మరియు చిత్రాలు దేశం యొక్క విశ్వాసం, చరిత్ర మరియు ఐక్యతను సూచిస్తుంది.  సౌదీ ఫ్లాగ్ డే.. 1937లో కింగ్ అబ్దుల్ అజీజ్ ప్రస్తుత జెండా రూపకల్పనను ఆమోదించిన రోజును స్మరించుకుంటారు.  సౌదీ అరేబియా రాజ్యంలో ఉన్న విద్యా విభాగాలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు వారి కార్యాలయాలలో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌లకు పౌరులు తమ అభినందనలు తెలియజేసారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com