పేషెంట్లు ఉపవాస దీక్షకు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి

- June 30, 2015 , by Maagulf
పేషెంట్లు ఉపవాస దీక్షకు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి

ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా దీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నవారు, రమదాన్ ఉపవాస దీక్షకు కు ఉపక్రమించేముందు వైద్యుల అనుమతి తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు తెలియచేశారు. ఒమాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు - సాధారణంగా లివర్ సిర్రొసిస్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి రుగ్మతలు లేదా దీర్ఘకాలంగా చికిత్సలో ఉన్న రకాల పేషం ట్లకు  వైద్య కారణాల వలన మినహాయింపు ఉన్నదని తెలిపారు. ఐనప్పటికీ, ప్రతిఒక్కరి ఆరోగ్యం భిన్నమైనదనీ, అటువంటి వారు డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ఫ్యామిలీ మెడిసిన్ యొక్క సేనియర్ కన్సల్టంటు డా. అహ్మెద్ హమేద్ అల్ వహైదీ తెలిపారు. అల్ రఫ్ఫా హాస్పి టల్ న్యూట్రిషనిస్టు మరియు వేయిట్ లాస్ కన్సల్టంటు ఐన మోనికా సేథ్, ఉపవాస దీక్ష  వారి వ్యక్తిగత మత నమ్మకానికి చెందినదైనప్పటికీ, కొన్ని రకాల వైద్యపరిస్థితులలో దానిని పాటించడం సమస్యాత్మకమని ఆమె తెలిపారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com