OMR30 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన రవాణా మంత్రిత్వ శాఖ

- March 14, 2024 , by Maagulf
OMR30 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన రవాణా మంత్రిత్వ శాఖ

మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి సుమారు OMR30 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2022 గణాంకాలతో పోలిస్తే 66 శాతం పెరిగింది.  2023లో మంత్రిత్వ శాఖ తన పర్యవేక్షణలో ఇప్పటికే ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ రంగ బకాయిల నుండి OMR216 మిలియన్లకు పైగా చెల్లించినట్టు రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ ఫహద్ సలీం అల్ హినై తెలిపారు.  ఇటీవలి వాతావరణ పరిస్థితులలో రోడ్ నెట్‌వర్క్‌కు జరిగిన నష్టాలను రోడ్డు నిర్మాణం, నిర్వహణ మరియు మరమ్మత్తులను కవర్ చేయడానికి చెల్లింపులు జరిగాయని అల్ హినై వెల్లడించారు.  అదే విధంగా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డిజిటల్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన బకాయిలను కూడా మంత్రిత్వ శాఖ పరిష్కరించిందని ఆయన వివరించారు. 2023లో మంత్రిత్వ శాఖ 230 ప్రోగ్రామ్‌లు మరియు శిక్షణా వర్క్‌షాప్‌లను అమలు చేసిందన్నారు. అలాగే స్థానికంగా మరియు విదేశాలలో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌ల నుండి మంత్రిత్వ శాఖలోని 1,916 మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందారని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com