రియాద్‌లో ప్రారంభమైన అల్-ఉరుబా పార్క్ నిర్మాణం

- March 14, 2024 , by Maagulf
రియాద్‌లో ప్రారంభమైన అల్-ఉరుబా పార్క్ నిర్మాణం

రియాద్: రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) డైరెక్టర్ల బోర్డు 'గ్రీన్ రియాద్'లో భాగంగా రియాద్ నగరంలోని అతిపెద్ద పార్కులలో ఒకటైన అల్-ఉరుబా పార్క్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ప్రకటించింది. 754,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది  పార్క్ ప్రాంతంలో 65 శాతంలో 600,000 కంటే ఎక్కువ చెట్లను నాటనున్నారు. రియాద్ నగరాన్ని ప్రపంచంలోని అత్యంత స్థిరమైన నగరాల్లో ఒకటిగా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com