చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ

- March 14, 2024 , by Maagulf
చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ

కువైట్: అబ్బాసియాలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో కేరళకు చెందిన ఓ యువతి తన బంగారు గొలుసు చోరీ అయింది. అబ్బాసియాలోని 'టీనేజ్' షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్‌యూవీలో వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దొంగలతో పోరాడుతున్న మహిళ తలపై గాయాలు కావడంతో ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com