చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ
- March 14, 2024
కువైట్: అబ్బాసియాలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో కేరళకు చెందిన ఓ యువతి తన బంగారు గొలుసు చోరీ అయింది. అబ్బాసియాలోని 'టీనేజ్' షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్యూవీలో వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దొంగలతో పోరాడుతున్న మహిళ తలపై గాయాలు కావడంతో ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష