అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్
- March 14, 2024
యూఏఈ: అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ హెచ్చరిక జారీ చేసింది.ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలో అబుదాబి నుంచి డబ్లిన్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి మీజిల్స్ పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది. ఈ సంఘటన గురించి ఐరిష్ అధికారులు తమకు సమాచారం అందించారని, అన్ని సన్నిహిత ట్రేసింగ్ కోసం అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (HSE) కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఐర్లాండ్ అధికారులు కోరారని వెల్లడించింది. ప్రయాణీకులను ప్రత్యేక గదిలో ఇంట్లోనే ఉండి, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మీజిల్స్ అనేది పిల్లలలో సర్వసాధారణం. వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఇది గాలిల ద్వార వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు సులభంగా వ్యాపిస్తుంది. మీజిల్స్ టీకా 2000 - 2021 మధ్య 56 మిలియన్ల మరణాలను నివారించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష