ఈద్ అల్ ఫితర్ సెలవులు: Dh9,000 నుండి టూర్ ప్యాకేజీలు
- March 14, 2024
యూఏఈ: ఏప్రిల్‌లో యూఏఈ నివాసితులు ఈద్ అల్ ఫితర్ కోసం తొమ్మిది రోజులపాటు సెలవులను పొందున్నారు. దాంతో సెలవులను గడిపేందుకు టూర్ ప్యాకేజీలకు డిమాండ్ పెరుగుతోందని నిపుణుల అభిప్రాయబడుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం 30 రోజులు కొనసాగితే.. ఈద్ సెలవులు ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 వరకు ఉంటాయి. దుబాయ్‌కి చెందిన dnata ట్రావెల్ బుకింగ్‌లు 2023 తో పోలిస్తే రెండింతలు పెరిగిందని తెలిపింది. స్థానికంగా ఉండే టూర్ల కోసం 40 శాతం, మొత్తం బుకింగ్‌లలో 60 శాతం అవుట్‌బౌండ్ టూర్లకు డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ముసాఫిర్ మాట్లాడుతూ..రాబోయే తొమ్మిది రోజుల ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం యూఏఈ అంతటా కుటుంబాలలో ఎదురుచూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈద్ ప్యాకేజీ విచారణలలో ఇది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సుమారు 30 శాతం బుకింగ్‌లు ఎక్కువ కాలం హాలిడే ప్యాకేజీలను కస్టమర్లు ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రజలు అజర్బైజాన్, జార్జియా లేదా ఆర్మేనియా, జార్జియా వంటి దేశాలను కలిపి ఏడు-తొమ్మిది రోజుల పాటు ఎక్కువ విరామాలను ఎంచుకుంటున్నారని వెల్లడించారు. లొకేషన్ మరియు రోజుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి తొమ్మిది రోజుల సెలవుల ప్యాకేజీలు Dh9,000 నుండి Dh13,000 వరకు ఉంటాయన్నారు. అగ్ర గమ్యస్థానాలలో గ్రీస్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ వంటి యూరోపియన్ దేశాలు ఉన్నాయని, ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు కలిపి ప్యాకేజీలను అధికంగా ఎంచుకుంటున్నారని తెలిపారు. వీటితోపాటు జపాన్, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్ మరియు మలేషియా సుదీర్ఘ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందాయన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష