గాయపడ్డ మమతా బెనర్జీ..హాస్పటల్ లో చికిత్స
- March 15, 2024పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. గురువారం తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా జారిపడ్డారు. దీంతో ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్’ట్విటర్’లో వెల్లడించింది. మమతా తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది.
ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో మమతా చికిత్స తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు