ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్, జ్ఞానేశ్
- March 15, 2024
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్లు గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ నియమితులైన విషయం తెలిసిందే.
తాజాగా వీరు ఈసీఐలో చేరారు.కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్గా ఉన్నారు. కమిషనర్గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది.
కాగా, ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్ మంత్రిని చేర్చటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష