ఒమన్ పై ప్రశంసలు కురిపించిన UN రాయబారి
- March 15, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌లో శాంతి నెలకోల్పడంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పాత్ర, మద్దతు గొప్పదని ప్రశంసలు కురిపిస్తూ.. యెమెన్‌లోని UN రాయబారి ఐక్యరాజ్యసమితి కృతజ్ఞతలు తెలిపారు. న్యూయార్క్‌లో హిస్ ఎక్సలెన్సీ ఒమన్ రాయబారి, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి నిర్వహించిన సమావేశం సందర్భంగా యెమెన్‌లోని UN ప్రత్యేక రాయబారి హిస్ ఎక్సలెన్సీ హన్స్ గ్రండ్బర్గ్.. తన ఆవర్తన నివేదికను సమర్పించే క్రమంలో ఒమన్ సుల్తానేట్ శాశ్వత ప్రతినిధి అయిన హిజ్ ఎక్సలెన్సీ అంబాసిడర్ డాక్టర్ ముహమ్మద్ బిన్ అవద్ అల్ హసన్‌తో సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ శాశ్వత ప్రతినిధి బృందం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. యెమెన్ లో శాశ్వత శాంతి మరియు స్థిరత్వాన్ని సాధించడంలో మద్దతు ఇవ్వడంలో ఒమానీ పాత్రకు ఐక్యరాజ్యసమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. యెమెన్‌కు మరియు దాని ఇతర పొరుగు దేశాల మధ్య బలమైన, శాంతియుత సంబంధాలను నెలకొల్పడానికి ఒమన్ విశిష్ఠ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యెమెన్‌లోని UN ప్రత్యేక రాయబారి కార్యాలయ సభ్యులు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ఒమన్ సుల్తానేట్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి కౌన్సెలర్ ఖలీద్ బిన్ సలేహ్ అల్-రబ్ఖీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







