బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..
- March 15, 2024
హైదరాబాద్: ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. సెర్చ్ వారెంట్ తో పాటు ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారన్న సమాచారంతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. అక్కడ హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నించిన్నట్లు సమాచారం. గతంలోనూ కవితను ఈడీ పలుసార్లు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఆయనను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
ఎన్నికల వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ను నేరుగా ఎదుర్కోలేకే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ మరో 24 గంటల్లో వస్తుందనగా కవిత ఇంటిపై ఈ దాడులు ఏంటని బీఆర్ఎస్ నేత క్రిశాంత్ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







