హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్‌షో..
- March 15, 2024
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. శుక్రవారం (మార్చి 15న) మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో మోదీ రోడ్‌షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోడ్ షోకు మోదీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగనుంది. మల్కాజిగిరిలో అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. రోడ్ షోలో మోదీతో పాటు 5 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఉన్నారు.
మల్కాజ్ గిరి, హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులతో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే, రోడ్ షోలో ప్రధాని మోదీ వెంట కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్లో రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం (మార్చి 16న) ప్రధాని మోదీ నాగర్‌కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష