ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ లవ్ స్టోరీ.!
- March 16, 2024
సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు సోదరుడిగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. తొలి సినిమా నుంచీ డిఫరెంట్ పంథాలో హీరోయిజం చూపిస్తూ వస్తున్నాడు.
లేటెస్ట్గా ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో కొత్త లవ్ స్టోరీతో రాబోతున్నాడు. అదే ‘డ్యూయెట్’. మిధున్ వరద రాజ కృష్ణన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. జ్ఞాన్వేల్ రాజా నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆకాశంలోకి చూస్తున్న ఆనంద్ దేవరకొండ మనసులో ప్రియురాలి ఫోటో కనిపిస్తోంది ఈ పోస్టర్లో. పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా వుంది. సినిమా కాన్సెప్ట్ కూడా అంతే డిఫరెంట్‌గా వుండబోతోందట.
జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రితికా నాయక్ ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. చూడాలి మరి, ‘బేబీ’ హిట్‌ని ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’తో కంటిన్యూ చేస్తాడో లేదో.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష