అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
- March 16, 2024
అమెరికా: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి మం. బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మార్చి 11న ఆ క్యాంపస్‌లోనే అభిజిత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు. స్నేహితుల ఫిర్యాదుతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. .
నిన్న రాత్రి అభిజిత్ డెడ్ బాడీ స్వగ్రామానికి తీసుకొచ్చారు. అభిజిత్ వయస్సు 20 ఏళ్లు.. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్‌ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది.. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. చదువకోడానికి వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. అభిజిత్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







