హైదరాబాద్ మెట్రోలో రజనీకాంత్.. చరిత్రాత్మకమన్న ఎల్ అండ్ టీ
- March 16, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు.దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెట్రోరైలు ఆపరేషన్స్‌కు నాగోల్‌లోని ఓసీసీ గురించి రజనీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన మెట్రో రైలు ఓసీసీని సందర్శించారు. నాగోల్‌కు వచ్చి అక్కడి మెట్రో సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించిన పరిస్థితులను చూశారు. మెట్రో రైలు అధికారులను సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మెట్రో రైలు ఓసీసీని సందర్శించడంపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. తమకు నిజంగా చారిత్రాత్మక సందర్భం అని తెలిపింది. ఈ క్షణం L&TMRHLకి అత్యంత కీలకమని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







