ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
- March 16, 2024
తెలంగాణ: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను చిద్రం చేశాయని, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కమలం వికసించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని మోదీ అన్నారు. తెలంగాణను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఈ ఐదేళ్లు చాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు కుటుంబ, అవినీతి పార్టీలని మోదీ విమర్శించారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ ఖాయం. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారంటూ మోదీ అన్నారు. ఎన్డీయే కూటమి ఈసారి 400 లోక్ సభ స్థానాలను గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే గాలివీస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష