లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- March 16, 2024
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (EC) శనివారం విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కాశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వుందని అన్నారు. దేశవ్యాప్తంగా నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇసి తెలిపారు. వారిలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు. 85 ఏళ్లు నిండిన వారు 82 లక్షల మంది. 85 ఏళ్లు దాటిన వారికి, విభిన్న ప్రతిభావంతులకు ఓట్ ఫర్ హోం పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 48వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. 18-19 వయస్సు మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గననున్నారు. దేశవ్యాప్తంగా 55 లక్షల ఇవిఎంలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్స్ వినియోగించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు