రేపటి నుంచి ఆన్లైన్లో IPL టిక్కెట్ల విక్రయం
- March 17, 2024
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పోటీలు ఈ నెల 22వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో తొలి మ్యాచ్కు చేపాక్కం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఆ రోజున పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ 22వ తేది రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ఈ నెల 18వ తేది ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో ప్రారంభం కానుంది. స్టేడియంలోని సీ,డీ,ఈ లోయర్ టిక్కెట్టు ధర రూ.1,700, ఐ,జే,కే అప్పర్ రూ.4,000, ఐ,జే,కే లోయర్ రూ.4,500, సీ,డీ,ఈ అప్పర్ రూ.4,000, కేఎంకే టెర్రస్ టిక్కెట్టు ధర రూ.7.500గా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒకరు రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చని, పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష