సుకుమార్ రైటింగ్స్ కొత్త చిత్రం టైటిల్ దర్శకుడు
- June 04, 2016
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. కుమారి 21ఎఫ్‌తో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా మరో విలక్షణమైన చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. దర్శకుడు టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి హర్ లవ్... హీజ్ ప్యాషన్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా అశోక్ అనే నూతన నటుడిని హీరోగా, హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ (bncsp) విజయ్‌కుమార్, ధామాస్ ఆదూరి, సత్తి నదీర్ రవిచంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతకుముందు... ఆ తర్వాతఫేం ఇషా నాయికగా, రెండో నాయికగా పూజిత నటించనుంది. ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ఇదొక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నేటి యువతరం మెచ్చే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి అని తెలిపారు. అశోక్, ఇషా, పూజిత, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఫోటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రామచంద్రాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, లైన్ ప్రొడ్యూసర్: వీఈవీకేడీఎస్ ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం హరిప్రసాద్ జక్కా..
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







